Hyderabad లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళకు దిగారు. మొఘల్ పుర ఫైర్ స్టేషన్ దగ్గర మొదలైన ఆందోళనలు...కాలాపత్తర్, మెహదీపట్నం, చాంద్రాయణ గుట్ట, షహీంనగర్,మక్కా మసీదు వరకూ వ్యాపించాయి. మహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ను అరెస్ట్ చేయాలంటూ ముస్లింలు ఆందోళకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.